ఈ పొస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 27న ప్రారంభించభం కాగా.. నవంబర్ 30, 2022న ముగిసింది. SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష(SSC GD Constable Recruitment Exam)2023 జనవరి 10 నుంచి ఫిబ్రవరి 14 వరకు నిర్వహిస్తున్నారు.
SSC GD Constable పొస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 27న ప్రారంభించభం కాగా.. నవంబర్ 30, 2022న ముగిసింది. SSC GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష(SSC GD Constable Recruitment Exam)2023 జనవరి 10 నుంచి ఫిబ్రవరి 14 వరకు నిర్వహిస్తున్నారు. మరో మూడు రోజుల్లో ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పరీక్షలు ముగియనున్నాయి. రాతపరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), మెడికల్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ఇంతకుముందు.. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయాల్సిన తాత్కాలిక ఖాళీలు 24369 వాటిలో పార్ట్ I కోసం 24205 ఖాళీలు మరియు పార్ట్ II కోసం 164 ఖాళీలు ఉన్నాయి. అయితే ఆ సంఖ్యను గత నవంబర్‌లో 45,284కు పెంచుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో ప్రకటన విడుదల చేసింది. అయితే తాజాగా ఈ పోస్టులకు మరో 1151 పోస్టులు కలుపుతూ ఎస్సెస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,435కు చేరింది.
తాజాగా విడుదల చేసిన సవరణ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 46,435 ఖాళీల్లో బీఎస్‌ఎఫ్‌లో 21,052, సీఐఎస్‌ఎఫ్‌లో 6,060, సీఆర్‌పీఎఫ్‌లో 11,169 ఎస్‌ఎస్‌బీలో 2274, ఐటీబీపీలో 1890, ఏఆర్‌లో 3601, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో 214, ఎన్‌సీబీలో 175 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో 41,250 పోస్టులు పురుషులకు, 5010 పోస్టులు మహిళలకు కేటాయించారు.
జీతం..
ఎన్‌సీబీలో సిపాయిలకు.. నెలకు రూ. 18,000 నుండి 56,900 మధ్య చెల్లిస్తారు.
BSF, CRPF, CISF, ITBP, SSF, SSB, NIA మరియు రైఫిల్‌మెన్ పోస్టులకు రూ. 21,700-69,100 మధ్య చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో ఉంటుంది.
-రాత త పరీక్ష (కంప్యూటర్ ఆధారిత)
-ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)
-ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
-వైద్య పరీక్ష
పరీక్ష విధానం..
GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ (CBT) పరీక్ష మొత్తం 160 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్ ప్రశ్నలు మొత్తం 40 మార్కులకు ఉంటాయి. పరీక్షను పూర్తి చేయడానికి అభ్యర్థులకు 60 నిమిషాల సమయం ఉంటుంది. పేపర్‌లో మొత్తం ప్రశ్నలలో 80 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.GD కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి,మొత్తం స్కోర్ నుండి 0.50 మార్కులు మైనస్ చేస్తారు.