(ఎప్రిల్ – 25) : ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహిస్తారు. మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కలిపించడం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశ్యం.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 106 దేశాల్లో 3.3 బిలియన్ ప్రజలు మలేరియా బారిన పడుతున్నారు.
2007లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలన్ని కలిసి ఈ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏర్పాటు చేశాయి. ఈ దినాన్ని ప్రతిసంవత్సరం ఏప్రిల్ 25 జరుపుకుంటారు.
2021లో మలేరియా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 6.27 లక్షల మంది మరణించారు.
మలేరియా వ్యాధి ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. మలేరియా ఔషధం క్వినైన్ ను సింకోనా అనే చెట్టు బెరడు నుండి తయారు చేస్తారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మలేరియా నిర్మూలన కొరకు “RDS – S/AS01” వ్యాక్సిన్ కు అమోదం తెలిపింది.
ప్రపంచ దేశాలన్నింటిలో నైజీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మొజాంబిక్, బుర్కినా ఫాసో, సియర్రా లియోన్ వంటి ఐదు దేశాలు ఎక్కువగా మలేరియా వ్యాధి బారినపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది.
(April – 25) : World Malaria Day is observed every year on April 25 across the world. The main objective of this day is to eradicate malaria and create awareness among people about this disease.
Malaria affects 3.3 billion people in 106 countries worldwide every year.
In 2007, the World Health Organization organized this World Malaria Day together with all the member countries. This day is celebrated on 25th April every year.
In 2021, 6.27 lakh people died worldwide due to malaria.
Malaria is transmitted by the female Anopheles mosquito. The malaria drug quinine is made from the bark of the cinchona tree.
World Health Organization has approved “RDS – S/AS01” vaccine for malaria eradication.
According to the World Health Organization report, five countries like Nigeria, Democratic Republic of Congo, Mozambique, Burkina Faso, and Sierra Leone are most affected by malaria.
Leave a Reply