TS Eamcet 2023, ICET 2023 and Edcet 2023 Exam Dates Released. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ (Eamcet 2023) పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
TS Eamcet 2023, ICET 2023 and Edcet 2023 Exam Dates Released: తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ (Eamcet 2023) పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష.. మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్ మరియు ఫార్మా పరీక్ష జరగనుంది. ఎంసెట్ 2023తో సహా తెలంగాణ రాష్ట్రంలో ఇతర ప్రవేశ పరీక్షల తేదీలను కూడా ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.
మే 18న (TS Edcet 2023) ఎడ్సెట్ 2023 పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. మే 20న (TS Ecet 2023) ఈసెట్ 2023.. మే 25న (TS LAWCET 2023) లాసెట్ 2023, పీజీ ఎల్సెట్ 2023.. మే 26, 27న (TS ICET 2023) ఐసెట్ 2023.. మే 29 నుంచి జూన్ 1 వరకు (TS PGECET 2023) పీజీ ఈసెట్ 2023 పరీక్షలు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ఓ ప్రకటనలో పేర్కొంది.
పరీక్ష తేదీలు (Exam Dates)
# మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష
# మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్ష
# మే 18న ఎడ్సెట్ 2023 పరీక్ష
# మే 20న ఈసెట్ 2023 పరీక్ష
# మే 25న లాసెట్ 2023 పరీక్ష, పీజీ ఎల్సెట్ 2023 పరీక్ష
# మే 26, 27న ఐసెట్ 2023 పరీక్ష
# మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీ ఈసెట్ 2023 పరీక్షలు
- EAMCET Engineering Exam from 7th to 11th May 2023
- EAMCET Agriculture and Pharma Exam from 12th to 14th May 2023
- EdCET 2023 exam on 18th May 2023
- ECET 2023 exam on 20th May 2023
- LASCET 2023 exam on 25th May, PG LSAT 2023 exam
- ICET 2023 exam on 2023 May 26, 27
- PG ECET 2023 Exams from May 29 to June 1
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.