స్టాప్ సెలక్షన్ కమిషన్ 26,146 పోలీస్ కానిస్టేబుల్ మరియు రైఫిల్ మ్యాన్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క హాల్ టికెట్లను (SSC CONSTABLE HALL TICKETS) విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరి 29 నుండి మార్చి 12వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. హిందీ ఇంగ్లీష్ తెలుగు తో సహా మొత్తం 13 ప్రాంతీయ భాషలో ఈ పరీక్ష ఈ సంవత్సరం నుండి నిర్వహించనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా 26,146 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.