ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(Institute Of Banking Personnel Selection) ద్వారా IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్ ibps.inని సందర్శించడం ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు. IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు 17 ఫిబ్రవరి 2023 వరకు అధికారిక సైట్లో అందుబాటులో ఉంటాయని ఐబీపీఎస్ పేర్కొంది. రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయడం ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 710 ఖాళీలను భర్తీ చేస్తారు. IBPS ఇంటర్వ్యూ షెడ్యూల్ త్వరలో విడుదల చేయబడుతుందని ఐబీపీఎస్ పేర్కొంది. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూలో విజయం సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. ఎంపికైన అభ్యర్థులు వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో నియమితులవుతారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ 1 నవంబర్ 2022 నుండి ప్రారంభమై.. 21 నవంబర్ 2022 వరకు కొనసాగింది.
ఖాళీలు (Vacancies)
ఈసారి నిర్వహించే పరీక్షలతో మొత్తం 710 ఖాళీలను భర్తీ చేయాలని IBPS లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఐటీ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుకు 44, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్ I) 516, రాజభాష అధికారి (స్కేల్ I) 25, లా ఆఫీసర్ (స్కేల్ I) 10, హెచ్ఆర్/పర్సనల్ 15 ఖాళీలు, స్కేల్ I అధికారి , మార్కెటింగ్ అధికారి పోస్టులు 100 ఖాళీగా ఉన్నాయి.
ఫలితాలను చెక్ చేసుకోండిలా (Check Results Online Now)
Step 1: ముందుగా అభ్యర్థులందరూ అధికారిక వెబ్సైట్ www.ibps.in ని సందర్శించండి.
Step 2: ఆ తర్వాత అభ్యర్థి హోమ్‌పేజీలో IBPS SO మెయిన్స్ రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3: తర్వాత అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
Step 4: ఇప్పుడు అభ్యర్థులు తమ IBPS SO మెయిన్స్ ఫలితాలను స్క్రీన్ పై చెక్ చేసుకోవచ్చు.
Step 5: ఆ తర్వాత అభ్యర్థి ఫలితాల పేజీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Step 6: చివరగా అభ్యర్థులు ఫలితం యొక్క కాపీని ప్రింట్ తీసుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది వివిధ బ్యాంకుల్లో క్లర్క్, పీవో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఐబీపీఎస్ క్లర్క్స్, ఐబీపీఎస్ పీవో, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పరీక్షలకు సంబంధించిన 2023-24 పరీక్షల క్యాలెండర్‌ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) జనవరి 16న వెల్లడించింది.
రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్, ప్రొబెషనరీ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయనుంది.
గ్రామీణ బ్యాంకులో ఆఫీసర్(స్కేల్-1), ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆగస్టు 5, 6, 12, 13, 19 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్ష సెప్టెంబరు 10, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. అదేవిధంగా ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్-2, 3 సింగిల్ పరీక్షను సెప్టెంబరు 10న నిర్వహించనుంది. ఐబీపీఎస్ క్లర్క్ పోస్టుల భర్తీకి ఆగస్టు 26, 27, సెప్టెంబరు 2న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా అక్టోబరు 7న మెయిన్ పరీక్ష ఉండనుంది. ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి డిసెంబరు 30, 31 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష, 2024 జనవరి 28న మెయిన్ పరీక్షలను ఐబీపీఎస్ నిర్వహించనుంది.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.
Leave a Reply