JEE Mains 2023 Results: JEE Main 1st Session Results Released, Check Here – జేఈఈ మెయిన్ తొలి సెషన్ ఫలితాలు విడుదల : దేశంలోని ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ జరిగిన మొదటి సెషన్ ఫలితాల విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా ఎక్కడా ఇంటర్ లేదా ప్లస్ టూ పరీక్షలు ముగియకుండానే..జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ ఫలితాలు వచ్చేశాయి. దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ తొలి విడత ఫలితాలు విడుదలయ్యాయి.
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ 2023 మెయిన్స్ మొదటి సెషన్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకూ జరిగాయి. పేపర్ 1కు 8.6 లక్షలమంది హాజరు కాగా, పేపర్ 2కు 46 వేలమంది హాజరయ్యారు. జేఈఈ మొదటి విడతకు 95.8 శాతం మంది హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో హాజరుకావడం ఇదే తొలిసారని తెలుస్తోంది. ఇక జేఈఈ రెండవ సెషన్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుండటంతో..మొదటి విడత పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల చేశారు. జేఈఈ మొదటి సెషన్ పరీక్షల ప్రాధమిక తేదీని ఎన్టీఏ ఫిబ్రవరి 1వ తేదీనే విడుదల చేసింది. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకూ అభ్యంతరాల్ని స్వీకరించింది.
ఎన్టీఏ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఏప్రిల్ 6 నుంచి 12 వరకూ జేఈఈ మెయిన్స్ రెండవ విడత పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ ప్రారంభమై..మార్చ్ 7వ తేదీ వరకూ ఉంటుంది. దీనికి సంబంధించిన దరఖాస్తులు లేదా మొదటి విడత పరీక్ష ఫలితాలు https:// jeemain.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని ఎన్టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ రెండవ సెషన్ పరీక్షల నగరాల వివరాల్ని మార్చ్ మూడవ వారంలో, రెండవ సెషన్ పరీక్షల అడ్మిట్ కార్డుల్ని మార్చ్ చివరి వారంలో విడుదల చేయవచ్చు.
Leave a Reply