TS POLYCET 2024 NOTIFICATION – తెలంగాణ రాష్ట్ర పాలిసెట్ – 2024 నోటిఫికేషన్ విడుదల అయింది. పదో తరగతి తర్వాత డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పాలిటెక్నిక్స్ ఇన్స్టిట్యూషన్స్ (ప్రభుత్వ/ ఎయిడెడ్ మరియు ఆన్ఎయిడెడ్ పాలిటెక్నిక్) పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం (PVNRTVU) చే ఆఫరు చేయబడిన పశుసంవర్ధనం మరియు మత్స్య పరిశ్రమ కోర్సులు, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTSHU) చే ఆఫరు చేయబడిన ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) చే ఆఫరు చేయబడిన వ్యవసాయ కోర్సుల లో ప్రవేశాల కోసం ఈ పాలిసెట్ రాయాల్సి ఉంటుంది.
అర్హత : పదో తరగతి
పాలిసెట్-2024 కొరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 15-2-2024.
దరఖాస్తు ఫీజు : ఎస్సి అండ్ ఎస్టిలకు రూ.250/- మరియు ఇతరులకు రూ. 500/- లతో
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : ఎప్రిల్ 22 – 2024.
రూ.100/- ఆలస్య రుసుముతో దరఖాస్తు వివరాలు పూరించి ఫీజు చెల్లింపునకు చివరి తేది: 24-4-2024.
రూ.300/- తత్కాల్ రుసుముతో దరఖాస్తు వివరాలు పూరించి ఫీజు చెల్లింపునకు చివరి తేది: 26-4-2024.
పాలిసెట్ పరీక్ష తేదీ : మే – 17 – 2021.
ఫలితాల ప్రకటన: పరీక్ష తర్వాత 12 రోజులకు
వెబ్సైట్ : https://polycet.sbtet.telangana.gov.in/#!/index