చదువు పూర్తయింది కానీ ఎలాంటి ఉద్యోగం లేదా ?.. పర్సనల్ డెవలప్ స్కిల్స్ లేక ఉద్యోగాలు రాక నిరుత్సాహానికి గురవుతున్నారా?, లేదంటే టెన్త్, ఇంటర్ కాగానే చదువు ఆపేసి.. ఆ తర్వాత కొన్ని రోజులకి చదువుకుంటే బాగుండేది.. ఉద్యోగం వచ్చేది కదా అని అనుకుంటున్నారా?
చదువు పూర్తయింది కానీ ఎలాంటి ఉద్యోగం లేదా ?.. పర్సనల్ డెవలప్ స్కిల్స్ లేక ఉద్యోగాలు రాక నిరుత్సాహానికి గురవుతున్నారా?, లేదంటే టెన్త్, ఇంటర్ కాగానే చదువు ఆపేసి.. ఆ తర్వాత కొన్ని రోజులకి చదువుకుంటే బాగుండేది.. ఉద్యోగం వచ్చేది కదా అని అనుకుంటున్నారా? టెన్త్ తోనే జాబ్స్ ఉంటే బాగుండేది కదా ఆలోచన చేస్తున్నారా? అయితే మీలాంటి వారి కోసం ఇది గొప్ప అవకాశం. మీకు ఎలాంటి జాబ్ కావాలంటే అలాంటి జాబ్ కోసం ఉచితంగా ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకొనిఇప్పుడే అడ్మిషన్ తీసుకోండి.. జాబ్ కొట్టేయండి.
పెద్దపల్లి జిల్లా (Peddapalli District) గోదావరిఖని ప్రాంతంలో గాంధీ పీజీ కాలేజీలో ఎస్సీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ఎటువంటి ఫీజ్ లేకుండానే ఉచితంగామూడు నెలల పాటు జాబ్ కోసం ట్రైనింగ్ చేస్తున్నారు. అరహతలు ఇవే… 10వ తరగతి పాస్, ఇంటర్ పాస్/ఫెయిల్, డిగ్రీ పాస్/ఫెయిల్, ఇతర కోర్సుల్లో పాస్/ఫెయిల్ అయిన 18-35 సంవత్సరాలనిరుద్యోగ యువతీ-యువకులకు ఇది ఒక్క సువర్ణ అవకాశం.
నేర్పించే స్కిల్స్..!
రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్చేత అనైత్య ఎడ్యుకేషనల్ సొసైటీ పథకం ద్వారా నిరుద్యోగులకు ఉచితంగా కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, గ్రామర్, స్కిల్స్, ఇతర వృత్తిపరమైన నైపుణ్యతా శిక్షణతో పాటుగా, కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన అర్హత గల సర్టిఫికెట్ ఇచ్చి విద్యార్థులకు మెరుగైన జీవనోపాధిని ఉద్యోగం కల్పిస్తారు.
శిక్షణా కాలంలో ఉచిత భోజనం, దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఉచితంగా హాస్టల్ వసతి కల్పిస్తారు. ఈ శిక్షణా కాలంలో ప్రతి విద్యార్థికి స్టడీ మెటీరియల్, యూనిఫామ్, ఐడీ కార్డు, బ్యాగ్ ఉచితంగా ఇస్తున్నారు.
జాబ్స్ వచ్చేవి ఇక్కడే..
శిక్షణ పొందిన విద్యార్థి విద్యార్థినులకు పేరు పొందిన పట్టణాలలో అభివృద్ధి చెందినకంపెనీలలో(MNC Companies)లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఈ శిక్షణకు గోదావరిఖని పట్టణంలోని విద్యార్థులే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా అర్హులు..
సంప్రదించాల్సిన నెంబర్లు ఇవే..
శిక్షణ తీసుకొని, ఉద్యోగం పొందుటకు ఆసక్తి గల ప్రతి నిరుద్యోగ గ్రామీణ/పట్టణ ప్రాంత యువతీ-యువకులు ఈ క్రింద ఉన్న ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. మా అడ్రస్ : అనైత్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఆఫీస్, గాంధీ పీజీ కాలేజ్, మార్కండేయ కాలనీ దగ్గర, గోదావరిఖని , తెలంగాణ -505209. ఫోన్-6302090737, 6300727431, 9515239116, 7416043442, 9492669623.