టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి విడుదలైన నోటిఫికేషన్లుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ చాలా వరకు జనవరి నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే వీటి దరఖాస్తుల ముగింపు ప్రక్రియ ఫిబ్రవరిలో(February) ఉన్నాయి. ఏ నోటిఫికేషన్ కు(Notification) సంబంధించి దరఖాస్తులు(Applications) ఏ తేదీన ముగుస్తున్నాయో పూర్తి వివరాలను తెలుసుకుందాం.. ఫిబ్రవరి 09వరకు చాలా నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మిగిలిన నోటిఫికేషన్ల వివరాలను తెలుసుకుందాం.
1. లైబ్రేరియన్ ఉద్యోగాలు
ఇంటర్ విద్యాశాఖ, పాలిటెక్నిక్ విభాగంలో లైబ్రేరియన్ పోస్టులకు జనవరి 21, 2023 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. వీటి దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 10, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అంటే నేటితో ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది.
2. అకౌంట్స్ ఆఫీసర్
అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అండ్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 20 నుంచి ప్రారంభం కాగా.. వీటికి దరఖాస్తులు ఫిబ్రవరి 11, 2023న ముగియనున్నాయి. రేపటితో అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి దరఖఖాస్తుల స్వీకరణ ముగియనుంది.
3. గ్రూప్ 2 ఉద్యోగాలు
గ్రూప్ 2 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ జనవరి 18, 2023 నుంచి ప్రారంభం అయింది. వీటికి దరఖాస్తుల స్వీకరణ ముగింపు ప్రక్రియ ఫిబ్రవరి 16, 2023 వరకు ఉంటుంది. ఇప్పటికే గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులు 4లక్షలకు పైగా ఈ పోస్టులకు దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోది. దరఖాస్తుల గడువు ముగిసే సమయానికి 5 నుంచి 6 లక్షల మధ్య దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు.
4. గ్రూప్ 3 పోస్టులు
గ్రూప్ 3 ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ జనవరి 24న ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అయింది. ఫిబ్రవరి 23, 2023 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. గ్రూప్ 3కి కూడా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే 2లక్షలకు చేరువలో అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం.
5. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు డిసెంబర్ 30, 2022 నుంచి దరఖాస్తుల ప్రారంభం అయ్యాయి. జనవరి 31, 2023న ఈ ప్రక్రియ ముగియాల్సి ఉండగా.. దీనిని ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు.
6. డీఎల్ నోటిఫికేషన్
ఇదిలా ఉండగా.. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి వెబ్ నోట్ విడుదలు చేసిన టీఎస్పీఎస్సీ పూర్తి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. జనవరి 31న విడుదల కావాల్సిన ఈ నోటిఫికేషన్ అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో దీనిని ఫిబ్రవరి 15కు వాయిదా వేశారు.
పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.