ఆంధ్రప్రదేశ్‌లోని కొత్త జిల్లాల్లో మండల, జిల్లా స్థాయి పోస్టులతో పాటు గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ ప్రక్రియ జరిగేలోగా తాత్కాలిక ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్, పదోన్నతులు, ఇన్చార్జి బాధ్యతల అప్పగింత ద్వారా త్వరగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అదేశాలు జరి చేయడం జరిగింది.
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు చర్యలు తీసుకోవాలి. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూపు 1, 2స్థాయి పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలి.
ఇటీవలే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెల్సిందే. ఇందులో భాగంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1,2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెల్సిందే. అలాగే సీడీపీఓ 63 ఉద్యోగాలకు భర్తీకి ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ సీడీపీఓ ఉద్యోగాలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. ఇదే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం అయింది. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. మొత్తం 20 కేటగిరీల్లో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.
గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నది సుమారుగా 20 కేటగిరిలో దాదాపు 14523 పోస్టులను భర్తీ చేస్తారని తెలుస్తుంది ఈ ఉద్యోగాలన్నిటిని మూడో విడత నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశాలు ఉన్నవి.
◆ పోస్టుల ఖాళీలు:
◆ గ్రేడ్-5- పంచాయతీ కార్యదర్శిలు 182
◆ డిజిటల్ అసిస్టెంట్ 736
◆ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ 578
◆ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 467 ఆర్టికల్చర్ అసిస్టెంట్ 1005
◆ సేరికల్చర్ అసిస్టెంట్ 23
◆ పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ 4765
◆ ఫిషరీ అసిస్టెంట్ 60
◆ ఇంజినీరింగ్ అసిస్టెంట్ 982
◆ వీఆర్వో గ్రేడ్-2 112
◆ విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ 990
◆ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 170
◆ వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 197
◆ వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ 153
◆ వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 371
◆ వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ నాలెడ్జ్ 36
◆ వార్డ్ ఎనిమిటి సెక్రటరీ 459
◆ ఏఎన్ఎం 618
◆ మహిళా పోలీస్ 1092
◆ ఎనర్జీ అసిస్టెంట్ 1127